సిరిసిల్ల జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ | ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Anganwadi Recruitment 2026: తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 55 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 7వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Telangana Anganwadi Recruitment 2026 Details

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా 55 అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి. (గ్రామాల వారీగా/ వార్డుల వారీగా, అంగన్వాడీ కేంద్రాల వారీగా, రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు కొరకు క్రింద ఇవ్వబడిన Vacancy Details లింకుపై క్లిక్ చేయండి)

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత | పరీక్ష, లేదు ఫీజు లేదు
  • సిరిసిల్ల 43 పోస్టులు
  • వేములవాడ 12 పోస్టులు

విద్యార్హతలు

ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

వయోపరిమితి

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం

ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Anganwadi Recruitment 2026: యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఇంటర్

దరఖాస్తు విధానం

అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 28-07-2026 తేదీ నుంచి 07-08-2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. క్రింద ఇవ్వబడిన Online Application form లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు కు కావలసిన సర్టిఫికెట్లు

  • పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము
  • నివాస ధ్రువీకరణ పత్రము
  • విద్యార్హత ధ్రువీకరణ పత్రములు (10th, ఇంటర్)
  • దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికేట్
  • వితంతువులు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రము
  • అనాధ అయితే అనాధ సర్టిఫికెట్
  • ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Vacancy Details

సూర్యాపేట జిల్లాలో 131 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

Online Application form

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!