Anganwadi Notification 2026: తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అంగన్వాడి టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్వాల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 62 టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడనికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Telangana Anganwadi Notification 2026 Details
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ నుంచి అంగన్వాడి టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా 62 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆల్వాల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి. (గ్రామాల వారీగా/ వార్డుల వారీగా, కేటగిరీల వారిగా ఖాళీల వివరాల కొరకు క్రింద ఇవ్వబడిన Vacancy Details లింక్ పై క్లిక్ చేయండి)
- ఆల్వాల్ 18 పోస్టులు
- మేడ్చల్ 20: పోస్టులు
- కుత్బుల్లాపూర్ 24 పోస్టులు
విద్యార్హతలు
అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
వయోపరిమితి
01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
ఇంటర్మీడియట్ విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 27.07.2026 తేదీ నుంచి 05.08.2026 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. కెక్రింద ఇవ్వబడిన Online Application form లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు)
దరఖాస్తు కు కావలసిన సర్టిఫికెట్లు
- పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము
- కుల ధ్రువీకరణ పత్రము తహసీల్దారుచే జారీ చేయబడినది
- విద్యార్హత ధ్రువీకరణ పత్రము. 10th, ఇంటర్ మార్కుల జాబితా.
- నివాస ధ్రువీకరణ పత్రము
- అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్
- వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రము
- అనాధ అయితే అనాధ సర్టిఫికెట్ తహసీల్దారుచే జారీ చేయబడినది

