AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Job Calendar Phase-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. AP Job Calendar Phase-2 కింద 26 శాఖల్లో మొత్తం 3168 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి ఆమోదం తెలిపింది. ఈరోజు (జూలై 23) వెలగపూడిలో గల సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త తెలుపుతూ 3168 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న విధంగా ఫేస్-2 నోటిఫికేషన్లను ఆగస్టు 15వ తారీఖున విడుదల చేయనున్నారు. ఈ తేదీన 26 శాఖల్లో మొత్తం 3168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఈ పోస్టులు భర్తీకి సంబంధించి నేడు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, అగ్నిమాపక శాఖలో ఫైర్ మెన్, జైళ్ల శాఖలో జైల్ వార్డెన్, దేవదాయ శాఖలో ఈవో గ్రేడ్-3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 వంటి ప్రాముఖ్యత కలిగిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఆగస్టు 15 తారీకునే విడుదల కానున్నాయి.

AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Job Calendar Phase-2 Notifications

శాఖల వారీగా పోస్టుల వివరాలు

  1. పోలీసు శాఖ: 1629 పోస్టులు
  2. అగ్నిమాపక శాఖ: 305 పోస్టులు
  3. ఆర్థిక మరియు గణాంకాల శాఖ: 213 పోస్టులు
  4. జైళ్ల శాఖ: 171 పోస్టులు
  5. ఏపీ స్పెషల్ పోలీస్ (APSP): 151 పోస్టులు
  6. పశుసంవర్ధక శాఖ: 150 పోస్టులు
  7. దేవాదాయ శాఖ: 104 పోస్టులు
  8. పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ: 78 పోస్టులు
  9. అటవీ శాఖ: 65 పోస్టులు
  10. కాలుష్యం నియంత్రణ బోర్డులో: 40 పోస్టులు
  11. పంచాయతీరాజ్ శాఖ: 35 పోస్టులు
  12. సోషియల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్: 33 పోస్టులు
  13. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్: 31 పోస్టులు
  14. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ: 29 పోస్టులు
  15. బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్: 29 పోస్టులు
  16. హార్టికల్చర్ డిపార్ట్మెంట్: 25 పోస్టులు
  17. కో ఆపరేటివ్ సొసైటీస్: 16 పోస్టులు
  18. బాలల సంక్షేమ శాఖ: 15 పోస్టులు
  19. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్: 12 పోస్టులు
  20. భూ పరిపాలన శాఖ: 11 పోస్టులు
  21. సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్: 10 పోస్టులు
  22. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF): 09 పోస్టులు
  23. స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్: 03 పోస్టులు
  24. రవాణా శాఖ: 03 పోస్టులు
  25. ట్రెజరీస్ & అకౌంట్స్ డిపార్ట్మెంట్: 01 పోస్టు
  26. ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ డిపార్ట్మెంట్: 01 పోస్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖున శాఖల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అర్హతలు, వయోపరిమితి, జీతం, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు వెల్లడించబడతాయి.

AP Anganwadi Jobs 2026 – ఏపీలో 216 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పరీక్ష లేదు | ఫీజు లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!