AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP JOB CALENDAR 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. క్యాలెండర్ లో పేర్కొన్న షెడ్యూల్ కు అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆగస్టు 15న రెండో విడత నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ముందుగా 3797 పోస్టులతో నోటిఫికేషన్లు విడుదల చేయాలని భావించినా.. తాజాగా 3168 పోస్టులు భర్తీకి పరిమితమైనట్లు తెలిసింది. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఈ అంశంపై కార్యదర్శులు, హెచ్వోడీలతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న విధంగా రెండో విడత నోటిఫికేషన్లు విడుదలకు సన్నాహాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పోస్టుల భర్తీ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీ తో పాటు ఇతర నియామక సంస్థలకు ఇండెంట్లు పంపించడం వంటి అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆగస్టు 15న విడుదల చేసే రెండో విడత నోటిఫికేషన్లలో ప్రధానంగా 91 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. అలాగే జైళ్ల శాఖలో జైల్ వార్డెన్ పోస్టులు, అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. ఈ విడత లోనే 240కి పైగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వీటితోపాటు అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్లు విడుదల చేసిన తర్వాత మూడో విడతలో సెప్టెంబర్ 15న గ్రూప్-2 నోటిఫికేషన్ తో పాటు పలు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!