AP Anganwadi Jobs 2026 – ఏపీలో 216 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పరీక్ష లేదు | ఫీజు లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Anganwadi Jobs 2026: ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైం.ది అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పోలవరం జిల్లాలో 216 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 8 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక వివాహిత మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నుంచి అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా పోలవరం జిల్లాలోనే మొత్తం 8 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 216 అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

  • అంగన్వాడి టీచర్ నాలుగు పోస్టులు
  • మినీ అంగన్వాడీ టీచర్ నాలుగు పోస్టులు
  • అంగన్వాడి హెల్పర్ 25 పోస్టులు

ఖాళీలు గల ఐసిడిఎస్ ప్రాజెక్టులు

  • రంపచోడవరం
  • మారేడుమిల్లి
  • అడ్డతీగల
  • రాజవొమ్మంగి
  • గంగవరం
  • చింతూరు
  • కూనవరం
  • ఏటపాక

విద్యార్హతలు

ఈ ఉద్యోగాలకు పదవ తరగతి విద్యార్హత కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

వయోపరిమితి

21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

జీతభత్యాలు

  • అంగన్వాడి టీచర్: రూ.11,500/-
  • మినీ అంగన్వాడీ టీచర్: రూ.7,000/-
  • అంగన్వాడి హెల్పర్: రూ.7,000/-

ఎంపిక విధానం

10వ తరగతిలో సాధించిన మార్కలు, అనుభవం, ఇంటర్వ్యూ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

Offline దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో తీసుకొని తిరిగి అదే ఐసిడిఎస్ కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలెను. దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం, నివాసం, పుట్టిన తేదీ, వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచాలి. మరిన్ని వివరాలకు సంబంధిత సిడిపిఓ కార్యాలయంలో సంప్రదించగలరు.

దరఖాస్తు తేదీలు

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు 07-07-2026 తేదీ నుంచి 20-07-2026 తేదీ లోపు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించవలెను.

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

క్రింది లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!