AP GENCO AEE Recruitment 2026: లక్షకు పైగా జీతంతో ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో ఏఈ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP GENCO AEE Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (AP GENCO) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో మొత్తం 100 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. జోన్ల వారీగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం లక్షకు పైగా ఉంటుంది. సంబంధిత బ్రాంచ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (AP GENCO) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో మొత్తం 100 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. (గమనిక: జోన్ల వారీగా, కేటగిరీల వారీగా ఖాళీల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.)

  • ఎలక్ట్రికల్: 52 పోస్టులు
  • మెకానికల్: 21 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్: 07 పోస్టులు
  • సివిల్: 20 పోస్టులు

విద్యార్హతలు

  • ఎలక్ట్రికల్ బ్రాంచ్: B.E / B.Tech ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • మెకానికల్ బ్రాంచ్ : B.E / B.Tech మెకానికల్ ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ : B.E / B.Tech ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • సివిల్ బ్రాంచ్ : B.E / B.Tech సివిల్ ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

వయోపరిమితి

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 47 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు 52 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జీతభత్యాలు

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం ప్రొబేషన్ కాలంలో నెలకు రూ.75,000 ఉంటుంది. ప్రవేశం పీరియడ్ పూర్తయిన తర్వాత పే స్కేల్ రూ.86,245 ఉంటుంది. అదనంగా ప్రాజెక్టు అలవెన్స్, షిఫ్ట్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్, క్వార్టర్స్ సౌకర్యం, హాస్పిటల్ సౌకర్యం, DAV స్కూల్ సౌకర్యం ఉంటుంది. అన్ని అలవెన్సులు కలుపుకొని లక్షకు పైగా జీతం ఉంటుంది.

ఎంపిక విధానం

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. సంబంధిత బ్రాంచ్ కోర్ సబ్జెక్టు నుంచి 70 మార్కులకు, రీజనింగ్ 5 మార్కులు, జనరల్ అవేర్నెస్ 7 మార్కులు, ఇంగ్లీష్ నాలెడ్జ్ 5 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 8 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 5 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.

పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 47 నగరాలతో పాటు హైదరాబాద్, ఖమ్మం, బెంగళూర్, చెన్నై, ఒరిస్సా రాష్ట్రంలోని బెర్హాపూర్ ప్రాంతాల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

పరీక్ష తేదీలు

22-08-2026 తేదీ నుంచి 29-08-2026 తేదీ వర్కులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. (సెప్టెంబర్ చివరి నాటికి మెరిట్ లిస్టు విడుదల చేస్తారు)

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు AP GENCO అధికారిక వెబ్సైట్ apgenco.gov.in లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు

రూ.1,000 ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. (ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించిన తర్వాత తిరిగి ఇవ్వబడదు.)

దరఖాస్తు తేదీలు

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు 30-06-2026 తేదీ నుంచి 20-07-2026 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Apply Online

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!