AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 230 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.
పోస్టుల వివరాలు:
అంగన్వాడి హెల్పర్: 230 పోస్టులు
శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి, నల్లచెరువు, ధర్మవరం, బత్తలపల్లి, సీ.కె.పల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు:
ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
01-07-2026 తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
అంగన్వాడి హెల్పర్ పోస్టులకు నెలకు రూ.7,000/- జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
10వ తరగతిలో సాధించిన మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలెను. దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం, నివాసం, పుట్టిన తేదీ, వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచాలి. మరిన్ని వివరాలకు సంబంధిత సీడీపీవో కార్యాలయంలో సంప్రదించగలరు.
దరఖాస్తుకు చివరి తేదీ:
18-06-2026 తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు
Notification Link

