అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UPSC IFS Recruitment 2026: అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (IPSC) నుండి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 80 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలోనే పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

UPSC IFS Recruitment 2026

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

పోస్టుల వివరాలు

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 80 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు 33 పోస్టులు, ఓబిసి అభ్యర్థులకు 21 పోస్టులు, ఎస్సీ అభ్యర్థులకు 12 పోస్టులు, ఎస్టీ అభ్యర్థులకు 06 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 08 పోస్టులు రిజర్వ్ చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి.. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

TG District Court Jobs 2026 | తెలంగాణలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

విద్యార్హతలు

క్రింద పేర్కొన్న సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్టు కలిగి డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది

భౌతికశాస్త్రం రసాయన శాస్త్రం వృక్షశాస్త్రం జంతుశాస్త్రం గణితశాస్త్రం గణాంకాలు భూగర్భ శాస్త్రం వ్యవసాయం అటవీ శాస్త్రం పశుసంవర్ధకం పశు వైద్యశాస్త్రం ఒక సబ్జెక్టుగా కలిగి ఉండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

Age limit

01-08-2026 తేదీ నాటికి 21 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

డిగ్రీ అర్హతతో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు భర్తీ | జీతం: రూ.45,960 | TGPSC Pollution Control Board Notification 2026

ఎంపిక విధానం

ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి, మెయిన్ పరీక్షలో 6 పేపర్లు ఉంటాయి. సిలబస్ వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

దరఖాస్తు ఫీజు పరీక్ష ఫీజు

  • OC, BC, EWS అభ్యర్థులు: రూ.100/- ఫీజు చెల్లించాలి
  • SC, ST, PwBD, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది

దరఖాస్తు విధానం

అర్హత కలిగిన అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ

24-02-2026 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!