తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NIT Warangal Recruitment 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIT Warangal Recruitment 2026

NIT Warangal Recruitment: తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ నుంచి నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 39 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 8వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి నాన్న టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 39 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

  • సూపరింటెండెంట్: 02 పోస్టులు
  • టెక్నికల్ అసిస్టెంట్: 11 పోస్టులు
  • సీనియర్ అసిస్టెంట్: 02 పోస్టులు
  • సీనియర్ టెక్నీషియన్: 07 పోస్టులు
  • జూనియర్ అసిస్టెంట్: 03 పోస్టులు
  • టెక్నీషియన్: 14

విద్యార్హతలు

ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటిఐ డిప్లొమా బి టెక్ అర్హతలతో పాటు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

వయోపరిమితి

08-02-2026 తేదీ నాటికి 27 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం.. పోస్టులను అనుసరించి నెలకు రూ.21,700 నుంచి రూ.1,12,400 వరకు జీతం ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్

ఈ ఉద్యోగాలను రాత పరీక్ష ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వడమైనది

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు ఫీజు

ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాలి.

దరఖాస్తుకు తేదీలు

09-01-2026 తేదీ నుంచి 08-02-2026 తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింకు పైకి లిఫ్ట్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!