APలో రాతపరీక్ష లేకుండా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | AP KGBV Notification 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP KGBV Notification 2026

AP KGBV Notification 2026: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖకు చెందిన సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. KGBV టైప్-3, టైప్-4 విభాగాల్లో మొత్తం 1095 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టైప్-3 కేజీబీవీల్లో ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్ కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ ఏఎన్ఎం అకౌంటెంట్ అటెండర్ హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ డే వాచ్ మెన్ నైట్ వాచ్ ఉమెన్ స్కావెంజర్ స్వీపర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. టైప్-4 కేజీబీవీల్లో వార్డెన్ పార్ట్ టైం టీచర్ చౌకీదార్ హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఏఎన్ఎం కోర్స్, బీఈడీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు చెందిన సమగ్ర శిక్ష సొసైటీ నుంచి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా టైప్ 3, టైప్ 4 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 1095 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

AP High Court Hall Tickets 2026 Released – Download Admit Card for Various Posts

టైప్-3 ఖాళీల వివరాలు

  • ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్: 77 పోస్టులు
  • కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్: 134 పోస్టులు
  • ఏఎన్ఎం: 110 పోస్టులు
  • అకౌంటెంట్: 11 పోస్టులు
  • అటెండర్: 28 పోస్టులు
  • హెడ్ కుక్: 22 పోస్టులు
  • అసిస్టెంట్ కుక్: 89 పోస్టులు
  • డే వాచ్ ఉమెన్: 18 పోస్టులు
  • నైట్ వాచ్ ఉమెన్: 26 పోస్టులు
  • స్కావెంజర్: 33 పోస్టులు
  • స్వీపర్: 16 పోస్టులు

టైప్-4 ఖాళీల వివరాలు

  • వార్డెన్: 86 పోస్టులు
  • పార్ట్ టైం టీచర్: 122 పోస్టులు
  • చౌకీదార్: 77 పోస్టులు
  • హెడ్ కుక్: 76 పోస్టులు
  • అసిస్టెంట్ కుక్: 170 పోస్టులు

విద్యార్హతలు

  • హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్లీపర్, స్కావెంజర్, నైట్ వాచ్ ఉమెన్, డే వాచ్ ఉమెన్, చౌకీదారు, అటెండర్ పోస్టులకు విద్యార్హత తప్పనిసరి కాదు.
  • కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హతతో పాటు PGDCM కంప్యూటర్ కోర్స్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. (లేదా) కంప్యూటర్ ఒక సబ్జెక్టు కలిగి ఉండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అకౌంటెంట్ పోస్టులకు బీకాం విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • వార్డెన్ మరియు పార్ట్ టైమ్ టీచర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు బీఈడీ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసి కేటగిరి అభ్యర్థులు 50 శాతం మార్కులతో, బీసీ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో, ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులు 40 శాతం మార్కులతో పాసై ఉండాలి.
  • ఏఎన్ఎం పోస్టులకు ఇంటర్మీడియట్ ఏఎన్ఎం ట్రైనింగ్స్ సర్టిఫికెట్ కలిగిన దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి

01-07-2025 తేదీ నాటికి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులు 50 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

ఎంపిక విధానం

వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. జిల్లా స్థాయి సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

  • ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు offline దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
  • 03-01-2026 తేదీ నుంచి 11-01-2026 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి
  • అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ లో దరఖాస్తులు సమర్పించవలెను
  • అభ్యర్థులు మరిన్ని వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి (AP KGBV Notification 2026)

Download Notification

Official Website

AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!