Job Mela: 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ అర్హతలతో రేపు జాబ్ మేళా నిర్వహణ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Job mela in Telangana

Job Mela: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జనవరి 9వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 19 నుంచి 30 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనుటకు అవకాశం ఉంటుంది. మొత్తం నూరు పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 9 వ తారీఖున ఖమ్మం లోని మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటిఐ., టేకులపల్లి) నందు జాబ్ మేళా నిర్వహిస్తారు. జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు అపోలో ఫార్మసీ, హైదరాబాదులో ఉద్యోగాలు చేయవలసి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12 వేల నుంచి 25 వేల వరకు జీతం ఉంటుంది. ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

Job Mela నిర్వహిస్తున్న సంస్థ

ఖమ్మం జిల్లా, జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

విద్యార్హతలు

10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

వయోపరిమితి

19 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన యువతి యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Job Mela నిర్వహణ ప్రదేశము

  • ఖమ్మం లోని మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటిఐ., టేకులపల్లి) నందు జాబ్ మేళా నిర్వహిస్తారు.
  • 09-01-2026 తేదీన ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తారు
  • జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి.

జీతభత్యాలు

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతం నెలకు 12 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!