57వేల జీతంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TTD Recruitment Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TTD JL Notification 2024: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) సంబంధించిన జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) సంబంధించిన జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు రేపటితో దరఖాస్తు గడువు ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 25వ తారీకు లోపు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

పోస్టుల వివరాలు:

జూనియర్ లెక్చరర్: 29 పోస్టులు

జూనియర్ లెక్చరర్ సబ్జెక్టుల వారీ ఖాళీలు: 

బోటనీ- 4, కెమిస్ట్రీ- 4, సివిక్స్- 4, కామర్స్- 2, ఇంగ్లిష్- 1, హిందీ- 1, హిస్టరీ- 4, మ్యాథమెటిక్స్- 2, ఫిజిక్స్- 2, తెలుగు- 3, జువాలజీ- 2.

విద్యార్హత: 

కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

APPSC: ఏపీ దేవదాయ శాఖలో ఈవో గ్రేడ్-3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

మొత్తం పోస్టుల సంఖ్య: 78.

వయోపరిమితి: 

2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: 

నెలకు రూ.57,100 నుంచి 1,47,760 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక విధానం: 

రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

APPSC Group-2 Notification 2026 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 686 గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు ఫీజు: 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250. 

ఇతరులకు రూ.370.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు తేదీలు: 

జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు మార్చి 5వ తారీకు నుంచి మార్చి 25వ తారీకు వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

APPSC Official Website

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!