June 20, 2024
TS Govt Jobs

TSPSC: గ్రూప్-4 ఉద్యోగాలకు నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు వెంటనే అప్లై చేయండి

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకు నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల అదనంగా మరో 141 పోస్టులను చేర్చింది. ప్రస్తుతం మొత్తం 8,180 గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే 9 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 జూలై 1వ తేదీన నిర్వహించనున్నారు.

పోస్టుల వివరాలు:

గ్రూప్-4: 8,180 పోస్టులు

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2022 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 3వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

2022 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC, SC, ST & EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు /పరీక్ష ఫీజు:

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు:200
పరీక్ష ఫీజు: 80

జీతభత్యాలు:

రూ.24,280/- నుంచి 72,850/- వరకు

ఎంపిక విధానం:

రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు చొప్పున 300 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Apply Online

Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!