June 24, 2024
TS Govt Jobs

TSPSC: 1,363 గ్రూప్-3 ఉద్యోగాలకు భారీ పోటీ.. ఇప్పటికి ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాలకు భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం నాటికి 3,83,537 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసే నాటికి ఈ సంఖ్య ఆరు లక్షలకు చేరే అవకాశం ఉంది. మొత్తం 1,363 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 105 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

గ్రూప్-3: 1,363 పోస్టులు

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 జనవరి 24వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

2022 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC, SC, ST & EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు /పరీక్ష ఫీజు:

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు:200
పరీక్ష ఫీజు: 80

జీతభత్యాలు:

రూ.24,280/- నుంచి 96,890/- వరకు

ఎంపిక విధానం:

రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు చొప్పున 450 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Apply Online

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!