TSPSC Group-2: గ్రూప్-2 ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ.. ఎన్ని లక్షలమంది దరఖాస్తు చేశారంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తు గడువు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మొత్తం 783 పోస్టులకు TSPSC ద్వారా నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టిఎస్పిఎస్సి వెల్లడించింది. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చివరి రోజు 68 వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 18 నుంచి 2023 ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నిన్నటితో దరఖాస్తు గడువు ముగిసింది.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

పరీక్షల నిర్వహణ తేదీపై వచ్చేవారం నిర్ణయం..

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

గ్రూప్-2 దరఖాస్తు గడువు ముగియడంతో పరీక్ష తేదీల ఖరారు పై టీఎస్పీఎస్సీ దృష్టి పెట్టింది. పరీక్షల నిర్వహణ తేదీ పై వచ్చే వారం నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!