January 15, 2026
TS Govt Jobs

TSPSC: గ్రూప్-3 ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో వచ్చిన దరఖాస్తులు.. ఎన్ని లక్షల మంది అప్లై చేశారంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాలకు రికార్డ్ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం సాయంత్రానికి 4,54,696 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసేసరికి ఈ సంఖ్య 5 లక్షలు దాటే అవకాశం ఉన్నదని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనున్నది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 1,375 గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-3 ఉద్యోగాలకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

గ్రూప్-3: 1,375 పోస్టులు

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 జనవరి 24వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NIT Warangal Recruitment 2026

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

2022 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC, SC, ST & EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు /పరీక్ష ఫీజు:

Job Mela: 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ అర్హతలతో రేపు జాబ్ మేళా నిర్వహణ

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు:200
పరీక్ష ఫీజు: 80

జీతభత్యాలు:

రూ.24,280/- నుంచి 96,890/- వరకు

ఎంపిక విధానం:

రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు చొప్పున 450 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

TSPSC AEE Recruitment 2026: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో 265 ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీ

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!