Job Mela: నేడు కర్నూలు జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహణ.. పలు కంపెనీల్లో 1350 ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలో 2025 డిసెంబర్ 8వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పలు కంపెనీల్లో 1350 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కర్నూలు కె.వి.ఆర్ కాలేజ్ నందు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

జాబ్ మేళాలో మొత్తం 19 కంపెనీలు పాల్గొంటున్నాయి. కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, టీవీఎస్ లుకాస్, టాటా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, అపోలో ఫార్మసీ, జస్ట్ డయల్, పేటీఎం, zepto, blinkit, టాటా క్యాపిటల్, ప్రీమియర్ హెల్త్ కేర్ సర్వీసెస్.. తదితర ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

ఈ జాబ్ మేళా ద్వారా 19 కంపెనీల్లో మొత్తం 1350 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?
  • 08-12-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు
  • ఇంటర్వ్యూ కు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి
  • ఇంటర్వ్యూకు హాజరయ్య అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలు వెంట తీసుకుని వెళ్లాలి

కర్నూలు జిల్లా: KVR Govt. College for Women (A), Narasimha Reddy Nagar, Railway Station Road, Kurnool.

Notification Link

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!