Constable Jobs: 10th క్లాస్ అర్హతతో 26,146 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Constable GD Notification 2023: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నుంచి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
✅ నిరుద్యోగుల కోసం ‘SSC GD Constable’ ఆన్లైన్ కోచింగ్ Full Course కేవలం ₹.499/- రూపాయలకే క్రింది యాప్ ద్వారా అందించడం జరుగుతోంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్(జీడీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేస్తున్నారు. నవంబర్ 24వ తారీకు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 31న పూర్తి కానుంది. 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ జీడీ పరీక్షలను ఈసారి తెలుగు భాషలో కూడా నిర్వహించనున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. BSF, CISF, CRPF, ITBP, SSB, AR, SSF విభాగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు భర్తీ కానున్నాయి. అర్హత, వయస్సు, దరఖాస్తు, సిలబస్, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
కానిస్టేబుల్ (GD) పోస్టులు: 26,146
విద్యార్హతలు:
10th క్లాస్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు
దరఖాస్తు ఫీజు:
రూ.100/- ఫీజు చెల్లించాలి.
SC/ST/మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష తేదీలు:
2024 ఫిబ్రవరి నెలలో 20,21,22,23,24,26,27,28,29 తేదీల్లో; అలాగే మార్చి నెలలో 1,5,6,7,11,12 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:
చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ఫిజికల్ టెస్టుల వివరాలు:
ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు:
Height:
Male: 170 cms
Female: 157 cms
Chest:
Male:
Un-expanded: 80 cms
Minimum Expansion: 5 cms
ST కేటగిరి అభ్యర్థులకు హైట్, చెస్ట్ లలో సడలింపు ఉంటుంది.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు:
Running Race:
Male:
5 kms in 24 minutes
Female:
1.6 kms in 8 1/2 minutes
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ:
2023 డిసెంబర్ 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సిలబస్:
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్/హిందీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. మొత్తంగా 80 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 160 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 60 నిమిషాలు సమయం ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి అర్ధ మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅ నిరుద్యోగుల కోసం ‘SSC GD Constable’ ఆన్లైన్ కోచింగ్ Full Course కేవలం ₹.499/- రూపాయలకే క్రింది యాప్ ద్వారా అందించడం జరుగుతోంది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి