8వేలకు పైగా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. తెలుగు భాష వచ్చి ఉండాలి | SBI Clerk Notification 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI Recruitment 2023: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ ఖాళీలతో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 8 వేలకు పైగా జూనియర్ అసోసియేట్స్(క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

Download Our App

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ ఖాళీలతో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 8,773 జూనియర్ అసోసియేట్స్(క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ హైదరాబాద్ సర్కిల్లో 525; ఆంధ్రప్రదేశ్ అమరావతి సర్కిల్లో 50 ఖాళీలున్నాయి. సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష ఉంటుంది. తెలుగు భాష కచ్చితంగా వచ్చి ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్ కేడర్)
మొత్తం పోస్టుల సంఖ్య: 8,773.
హైదరాబాద్ సర్కిల్(తెలంగాణ) లో: 525 పోస్టులు.
అమరావతి సర్కిల్(ఆంధ్రప్రదేశ్)లో: 50 పోస్టులు.

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

AP SSC Exams Schedule 2026: ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

2023 ఏప్రిల్ 1వ తారీకు నాటికి 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు ఐదేళ్లు, BC అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

నెలకు రూ.19,900/- జీతం ఉంటుంది.

ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.

మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు… 50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు… 40 మార్కులు; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు… 50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు… 60 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NIT Warangal Recruitment 2026

అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.750/- ఫీజు చెల్లించాలి.
SC/ST అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

2023 డిసెంబర్ 7వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

RRB Group D Notification 2026
RRB Group D Notification 2026: రైల్వేలో 22 వేల గ్రూప్-డి ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల

Notification Link

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!