TSPSC Group 2 | జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
TSPSC Group 2: తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది.
✅అతి తక్కువ ధరలో SSC GD కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ పరీక్ష నిర్వహణపై నాంపల్లిలోనే టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సోమవారం కమిషన్ సమావేశమైంది. పరీక్ష నిర్వహణ, వసతులు, నిబంధనలు తదితర అంశాలపై 33 జిల్లా కలెక్టర్లకు టీఎస్పీఎస్సీ పలు సూచనలు చేశారు. ఇంతకుముందు గుర్తించిన పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయని, అందులో మార్పులు, చేర్పులుంటే తమకు తెలియజేయాలని సూచించింది. చీఫ్ సూపరింటెండెంట్ గదిలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలని, అక్కడే కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ తెరిచి పంపిణీ చేయాలని, ఓఎంఆర్ షీట్లు లెక్కించడం, ప్యాక్ చేయడం, సీల్ వేయడం వంటివన్నీ జరగాలని టీఎస్పీఎస్సీ వివరించింది. పరీక్ష నిర్వహించే కేంద్రాలకు ఆ రెండు రోజులు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లను టీఎస్పీఎస్సీ కోరింది.
వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీల్లో టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. జనవరి 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-2 (చరిత్ర, రాజకీయం, సమాజం) పరీక్ష జరగనుంది. అలాగే జనవరి 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-3 (ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి), మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-4 ( తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) పరీక్ష జరగనుంది. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. నాలుగు పేపర్లలో కలిపి 600 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు.
✅అతి తక్కువ ధరలో SSC GD కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి