రైల్వే శాఖలో 9వేల టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇంటర్, ఐటీఐ అర్హతలు | RRB Technician Notification 2024
RRB Technician Posts: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసింది.
✅నిరుద్యోగులకు కోసం: “RPF Constable” ఆన్లైన్ కోచింగ్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 9వేల టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం 2024 ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 2024 మార్చి – ఏప్రిల్ నెలల్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించనున్నారు. రాతపరీక్షలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు 2025 ఫిబ్రవరి నెలలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.
RRB టెక్నీషియన్ పోస్టులకు ఐటీఐ, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి టెక్నీషియన్ ఉద్యోగాల షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోగలరు
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.