June 18, 2024
AP Govt Jobs

APPSC: గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక సూచనలు

APPSC Group 2 Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష తేదీకి సంబంధించి ఏపీపీఎస్సీ కీలక సూచనలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించింది.

✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష తేదీలో ఎటువంటి మార్పులేదని ఏపీపీఎస్సీ వెల్లడించింది. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఫిబ్రవరి 25వ తేదీనే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడబోతున్నట్లు వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలిపింది. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ను కొనసాగించాలని సూచించింది.

మొత్తం 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 539 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.గ్రూప్-2 పోస్టులకు సంబంధించిన ప్రాథమిక పరీక్షను ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 25న నిర్వహించనుంది. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!