SSC GD Constable: 10th క్లాస్ అర్హతతో 26,146 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. తెలుగు భాషలో పరీక్ష

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC GD Constable Recruitment 2023: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Download Our APP

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) మరో శుభవార్త తెలిపింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్(జీడీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేస్తున్నారు. నవంబర్ 24వ తారీకు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 31న పూర్తి కానుంది. కానిస్టేబుల్ జీడీ పరీక్షలను 2024 ఫిబ్రవరి 20వ తారీకు నుంచి మార్చి 12వ తారీకు వరకు నిర్వహించనున్నారు. ఈసారి తెలుగు భాషలో కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. BSF, CISF, CRPF, ITBP, SSB, AR, SSF విభాగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు భర్తీ కానున్నాయి. అర్హత, వయస్సు, దరఖాస్తు, సిలబస్, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

కానిస్టేబుల్ (GD) పోస్టులు: 26,146

10th క్లాస్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రూ.100/- ఫీజు చెల్లించాలి.
SC/ST/మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

2024 ఫిబ్రవరి నెలలో 20,21,22,23,24,26,27,28,29 తేదీల్లో; అలాగే మార్చి నెలలో 1,5,6,7,11,12 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు:

Height:
Male: 170 cms
Female: 157 cms

Chest:
Male:
Un-expanded: 80 cms
Minimum Expansion: 5 cms

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ST కేటగిరి అభ్యర్థులకు హైట్, చెస్ట్ లలో సడలింపు ఉంటుంది.

Running Race:

Male:
5 kms in 24 minutes

Female:
1.6 kms in 8 1/2 minutes

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

2023 నవంబర్ 24 వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

2023 డిసెంబర్ 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్/హిందీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. మొత్తంగా 80 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 160 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 60 నిమిషాలు సమయం ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి అర్ధ మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

Notification Link

Official Website

Download Our APP

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!