December 7, 2024
AP Govt Jobs

APPSC Group-2 | గ్రూప్-2 ప్రీవియస్ ప్రశ్నలు (ఇండియన్ హిస్టరీ – సింధు నాగరికత)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సిలబస్ ప్రకారం నిర్వహించే గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలో ఇండియన్ హిస్టరీ సబ్జెక్టు నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇండియన్ హిస్టరీ సబ్జెక్టు నుంచి గత గ్రూప్-2 పరీక్షల్లో చాప్టర్ వారీగా వచ్చిన ప్రీవియస్ ప్రశ్నలు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలను క్షుణ్ణంగా చదివి రాబోయే గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధం అవ్వగలరు. రాబోయే గ్రూప్-2 పరీక్షలో ఇండియన్ హిస్టరీ సబ్జెక్టు నుంచి చాప్టర్ వారీగా ఎలాంటి ప్రశ్నలు వస్తాయో అనే దానిపై అవగాహన పెంచుకోగలరు.

1).ప్రాంతీయముగా మొహంజదారో యొక్క నామము?

1.మౌండ్ ఆఫ్ ది గ్రేట్
2.మౌండ్ ఆఫ్ ది లివింగ్
3.మౌండ్ ఆఫ్ ది సర్వైవర్
4.మౌండ్ ఆఫ్ ది డెడ్

Ans: 4

2).హరప్పన్ నాగరికతలో గొప్పదైన ధాన్యాగారము ఏర్పాటు చేయబడి ఉన్నది ఎక్కడ?

1.రోపర్
2.హరప్పా
3.కలిబంగన్
4.మొహంజోదారో

Ans: 4

3).సింధూ లోయ నాగరికతలో వాడిన లిపి?

1.ఇంతవరకు అభివృద్ధి చెందలేదు
2.వేదిక భాష
3.బొమ్మలు మరియు చిత్రపటాలతో రూపొందించినది
4.పైది ఏది కాదు

Ans: 3

4).హరప్పా సంస్కృతిలోని అతి ముఖ్యమైన అంశం ఏది?

1.లిపి
2.మతం
3.కళ
4.నగరీకరణ

Ans: 4

5).ఏ సింధూలోయ నగరంలో ముద్రలు కనుగొనబడినవి?

1.చన్హుదారో
2.సుర్కోటుడా
3.లోథల్
4.కాలిభంగన్

Ans: 3

6).సింధు నాగరికత కాలం నాటి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది ఏది?

1.వర్తకం
2.వడ్రంగి పని
3.పశు పోషణ
4.వ్యవసాయం

Ans: 4

7).హరప్పా ప్రజలు పూజించిన పక్షులు క్రింది వానిలో ఏది?

1.పావురం
2.నెమలి
3.కాకి
4.గ్రద్ద

Ans: 1

8).సింధులోయ నాగరికత దేనిలో ప్రత్యేకీకరణ కలిగినది?

1.భవన నిర్మాణం
2.పట్టణ ప్రణాళిక
3.శిల్పకళ
4.పైవన్నీ

Ans: 2

గ్రూప్-2 కొత్త సిలబస్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

APPSC Group-2 Syllabus

అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!