ఇంటర్ అర్హతతో 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
SSC Constable Recruitment 2023 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 7,547 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 7,547 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పురుష అభ్యర్థులకు 5,056 పోస్టులు, మహిళా అభ్యర్థులకు 2,491 పోస్టులను కేటాయించారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష కేంద్రాలు ఉంటాయి. సెప్టెంబర్ 5వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) – పురుషులు: 5,056
కేటగిరీల వారీగా ఖాళీలు: జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్ – 542, ఓబీసీ – 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302
కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)- మహిళలు: 2,491
కేటగిరీల వారీగా ఖాళీలు: జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్ – 268, ఓబీసీ – 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150
విద్యార్హతలు:
ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పురుష అభ్యర్థులు ఫిజికల్ టెస్టుల (PET/ PMT) నాటికి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్(LMV) కలిగి ఉండాలి.
జీత భత్యాలు:
నెలకు రూ.21,700/- నుంచి రూ. 69,100/- వరకు
దరఖాస్తు ఫీజు:
రూ.100/- ఫీజు చెల్లించాలి.
(ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు)
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(PMT), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష:
ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులు 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ సంబంధిత అంశాల్లో ప్రశ్నలుంటాయి. పరీక్షకు 90 నిమిషాలు సమయం ఇస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చివరి తేదీ:
2023 సెప్టెంబర్ 30 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష నిర్వహణ తేదీలు:
2023 నవంబర్ 14వ తారీకు నుంచి డిసెంబర్ 5వ తారీఖు లోపు నిర్వహిస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.