March 4, 2024
AP Govt Jobs

APPSC Group 2: గ్రూప్-2 ఉద్యోగాలు భారీగా పెంపు?

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 పోస్టులు భారీగా పెరగనున్నాయి. వెయ్యికి పైగా పోస్టులు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలు భారీగా పెరగనున్నాయి. గత నెలలో 897 గ్రూప్ 2 ఉద్యోగాల పడితేకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అదనంగా మరో రెండు పోస్టులను కలిపింది. అంటే మొత్తం 899 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ప్రస్తుతం ప్రకటించిన పోస్టులతో పాటు కొన్ని ప్రభుత్వ విభాగాల్లో మరిన్ని ఖాళీలు ఉన్నట్లు తేలింది. ఆ పోస్టులను సైతం ఈ నోటిఫికేషన్ కు జత చేయనున్నారు. ఇదే జరిగితే మొత్తం గ్రూప్-2 పోస్టుల సంఖ్య 1,000కి పైగా చేరే అవకాశం ఉంది.

గ్రూప్-2 పోస్టులకు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 4,83,525 దరఖాస్తులు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ప్రకటించింది. ప్రస్తుతం గ్రూప్-2 ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తులలో ఒక్కో పోస్టుకు సగటున 538 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు జనవరి 17వ తారీకున దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే. దరఖాస్తు గడువు ముగియడంతో తప్పులను సవరించుకునేందుకు ఈనెల 24 వరకు కమిషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఈ క్రమంలో అభ్యర్థులు తప్పులు సరిదిద్దుకుని, సరిచేసుకోవచ్చు. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 25 నిర్వహించనున్నారు.

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!