December 6, 2024
AP Govt Jobs

APPSC: గ్రూప్-2 ఒక్కో పోస్టుకు 538 మంది పోటీ.. మొత్తం ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయంటే?

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు సగటున 538 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 4,83,525 దరఖాస్తులు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ప్రకటించింది. గత నెలలో ఇచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్లో తొలుత 897 పోస్టులను ప్రకటించగా, అదనంగా మరో రెండు పోస్టులు కలిపి మొత్తం 899 పోస్టులు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం గ్రూప్-2 ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తులలో ఒక్కో పోస్టుకు సగటున 538 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు జనవరి 17వ తారీఖున దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే. దరఖాస్తు గడువు ముగియడంతో తప్పులను సవరించుకునేందుకు ఈనెల 24 వరకు కమిషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఈ క్రమంలో అభ్యర్థులు తప్పులు సరిదిద్దుకుని, సరిచేసుకోవచ్చు.

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!