October 14, 2024
AP Govt Jobs

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్ పోస్టులు

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టులో ఆవుట్సోర్సింగ్ ప్రాతిపదికన రికార్డ్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్, టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, మచిలీపట్నంలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టర్లను భర్తీ చేస్తున్నారు. 7th క్లాస్, 10th క్లాస్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. నవంబర్ 4వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు విధానం వివరాలు తెలుసుకుందాం…

పోస్టుల వివరాలు:

1.రికార్డ్ అసిస్టెంట్: 01 పోస్టు
2.ఆఫీస్ సబార్డినేట్: 01 పోస్టు
3.టైపిస్ట్ కం అసిస్టెంట్: 01 పోస్టు

వయోపరిమితి:

2023 సెప్టెంబర్ 30వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

1.రికార్డ్ అసిస్టెంట్: రూ.15,000/-
2.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-
3.టైపిస్ట్ కం అసిస్టెంట్: రూ.18,500/-

విద్యార్హతలు:

1.రికార్డ్ అసిస్టెంట్: 10వ తరగతి పాసై తెలుగు & ఇంగ్లీష్ భాషలు వచ్చి ఉండాలి.

2.ఆఫీస్ సబార్డినేట్: 7వ తరగతి పాసై తెలుగు భాష వచ్చి ఉండాలి.

3.టైపిస్ట్ కం అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి టైపింగ్ లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలపై పట్టు ఉండాలి.

దరఖాస్తు విధానం:

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

The Chairperson,
District Legal Services Authority,
Machilipatnam,
Krishna District.

దరఖాస్తుకు చివరి తేదీ:

2023 నవంబర్ 3వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింకుపై క్లిక్ చేయండి

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!