APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు.. పరీక్ష తేదీ?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త తెలిపింది. గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగించినట్లు అధికారికంగా ఓ ప్రకటనలో తెలిపింది.

Download Our App

AP Job Mela 2026: ఏపీలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహణ | 1,675 ఉద్యోగాలు భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తు గడువు తేదీని పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఓ ప్రకటనలో తెలిపింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 17వ తేదీ వరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు ఉండదని.. ఫిబ్రవరి 25వ తారీకునే ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 52 ప్రభుత్వ శాఖల్లో 897 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. గతంలో నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లుగా జనవరి 10వ తేదీనే చివరి తేదీ కాగా.. దరఖాస్తు చేసేందుకు సర్వర్ పరంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దరఖాస్తు గడువు దగ్గర పడడం వల్ల.. ఏకకాలంలో అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తుండడంతో సర్వర్ జామ్ అవుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువు పొడిగించాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ ని విన్నవించుకున్నారు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు దరఖాస్తు గడువు పొడగించినట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.

గ్రూప్-2 ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యారత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను ఫిబ్రవరి 25వ తారీకున ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.

Job Mela: ఏపీలో జూన్ 24న మెగా జాబ్ మేళా నిర్వహణ | 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు

Download Our App

Whatsapp Group Link

AP District Court Jobs 2026 – ఏపీ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!