APPSC Group-2: ఏపీ స్టడీ సర్కిల్ లో గ్రూప్-2 ‘ఫ్రీ’ కోచింగ్.. ఉచిత భోజనం, వసతి, మెటీరియల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ నిర్వహణలో రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, గ్రూప్-2 నియామక పరీక్షలకు సంబంధించి ఉచితంగా శిక్షణ అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర కేటగిరీలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత కోచింగ్ తో పాటు ఉచిత వసతి, భోజనం, మెటీరియల్ అందిస్తారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
కోచింగ్ కేంద్రాల వివరాలు:
1.ఏపీపీఎస్సీ గ్రూప్-1 కోచింగ్: విజయవాడ
2.ఏపీపీఎస్సీ గ్రూప్-2 కోచింగ్: తిరుపతి
3.సివిల్ సర్వీసెస్ కోచింగ్: విశాఖపట్నం
విద్యార్హత:
ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అర్హులు.
అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై, కుటుంబ వార్షికాదాయం రూ.6.00 లక్షల లోపు ఉండాలి.
వయోపరిమితి:
21 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
అప్లికేషన్ ఫీజు:
ఫీజు లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 ఆగస్టు 5వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి
క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి