May 28, 2024
AP Govt Jobs

APPSC: ఏపీలో గ్రూప్-2 తరహా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 తరహా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసులో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసులో ఉద్యోగాల భర్తీకి.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉పోస్టుల వివరాలు: 

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

👉విద్యార్హతలు: 

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయోపరిమితి: 

2024 జూలై ఒకటవ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

నెలకు రూ.48,440 నుండి రూ.1,37,220 రూపాయల వరకు జీతం ఉంటుంది.

👉ఎంపిక విధానం:

రాతపరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, కంప్యూటర్ ప్రొఫిసియన్సీ టెస్ట్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉సిలబస్ వివరాలు: 

క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా పూర్తి సిలబస్ వివరాలు తెలుసుకోగలరు.

👉దరఖాస్తు విధానం: 

ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: 

ఓసి అభ్యర్థులు 370 రూపాయలు, 

బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 250 రూపాయలు ఫీజు చెల్లించాలి.

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

2024 ఏప్రిల్ 16వ తారీకు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

👉Notification Link

👉Official Website

✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 Mains ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!