AP Grama Sachivalayam Jobs: గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,523 ఉద్యోగాల భర్తీ.. శాఖల వారీగా ఖాళీల వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Grama/Ward Sachivalayam Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 14,500 పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో మూడో విడత ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలను కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నూతనంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత.. మూడో నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక మూడో విడత నోటిఫికేషన్ ద్వారా 14,500 పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం.

ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలోలా కాకుండా ఈసారి 20 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 20 రకాల పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు: 182
డిజిటల్ అసిస్టెంట్: 736
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్: 578
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్: 467
హార్టికల్చర్ అసిస్టెంట్: 1,005
సెరికల్చర్ అసిస్టెంట్: 23
వెటర్నరీ అసిస్టెంట్: 4,765
ఫిషరీస్ అసిస్టెంట్: 60
ఇంజనీరింగ్ అసిస్టెంట్: 982
వీఆర్వో గ్రేడ్-2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ: 112
విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్: 990
వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ: 170
వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ: 197
వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ: 153
వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ: 371
వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ: 436
వార్డు ఎమినిటీస్ సెక్రటరీ: 459
ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ: 618
మహిళా పోలీసు (గ్రామ/వార్డు): 1,092
ఎనర్జీ అసిస్టెంట్: 1,127

మొత్తం పోస్టుల సంఖ్య: 14,523
(నోటిఫికేషన్ విడుదల చేసే నాటికి ఈ పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది)

కేటగిరి-1 పోస్టులు అయినటువంటి పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్-5, వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, మహిళా పోలీస్ ఉద్యోగాల సిలబస్ వివరాలు కింద ఇవ్వడమైనది. కేటగిరి-1 పోస్టులు అన్నింటికీ ఒకే సిలబస్ ఉంటుంది. పరీక్షలు మాత్రం ఈసారి వేరువేరుగా నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే అవకాశం ఉంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేటగిరి-1 ఉద్యోగాల రాతపరీక్షలో ఒకే పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో పార్ట్-A, పార్ట్-B అను రెండు పార్టులు ఉంటాయి. ఒక్కో పార్ట్ నుండి 75 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

PART – A

జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ

1.జనరల్ మెంటల్ ఎబిలిటీ మరియు రీజనింగ్.
2.డేటా ఇంటర్ ప్రేటేషన్ తో సహా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.
3.రీడింగ్ కాంప్రహెన్షన్ – తెలుగు & ఇంగ్లీష్.
4.జనరల్ ఇంగ్లీష్.
5.ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం.
6.ప్రాంతీయ , జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కరెంట్ అఫైర్స్.
7.జనరల్ సైన్స్ మరియు నిత్యజీవితంలో జనరల్ సైన్స్ అనువర్తనాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అభివృద్ధి.
8.సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ.

PART – B

1.ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితో భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి.
2.భారత రాజ్యాంగం మరియు గవర్నెన్స్. 73, 74 రాజ్యాంగ సవరణలు. కేంద్ర – రాష్ట్ర సంబంధాలు.
3.ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రణాళిక.
4.సమాజం, సామాజిక న్యాయం మరియు హక్కుల సమస్యలు.
5.భారత ఉపఖండం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక భౌగోళిక శాస్త్రం.
6.ఆంధ్రప్రదేశ్ విభజన మరియు దాని పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయంపరమైన చిక్కులు/ సమస్యలు.
7.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు.
8.మహిళా సాధికారత, స్వయం సహాయక బృందాలు.

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!