తెలంగాణ ఆర్టీసీలో సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TGSRTC Supervisor Trainee Notification 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGSRTC Supervisor Trainee Jobs: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని, మెకానికల్ సూపర్వైజర్ ట్రైని పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 198 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకే ఒక్క రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏదైనా డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2026 జనవరి 20వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో (TGSRTC) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని, మెకానికల్ సూపర్వైజర్ ట్రైన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 198 పోస్టులు భర్తకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం
  • ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని: 84 పోస్టులు
  • మెకానికల్ సూపర్వైజర్ ట్రైని: 114 పోస్టులు
  1. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని: ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
  2. మెకానికల్ సూపర్వైజర్ ట్రైని: ఈ ఉద్యోగాలకు డిప్లమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2025 జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.27,080/- నుంచి రూ.81,400/- వరకు ఉంటుంది.

ఒకే ఒక్క రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ లు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సిలబస్ వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ www.tgprb.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఓసి, బీసీ అభ్యర్థులు రూ.800; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి. ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాలి.

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు 2025 డిసెంబర్ 30 వ తారీఖు నుంచి 2026 జనవరి 20వ తారీకు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!