Telangana Jobs: 30 వేల జీతంతో తెలంగాణలో కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Telangana Jobs: తెలంగాణ రాష్ట్రం, వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 30 వ తారీకు లోపు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు
డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), BCA విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు
ఈ ఉద్యోగానికి ఎంపిక అయ్యే అభ్యర్థికి రూ.30,000 జీతం ఉంటుంది .
ఎంపిక విధానం
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు
దరఖాస్తు విధానం
అర్హత కలిగిన అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ-మెయిల్ అడ్రస్, దరఖాస్తు ఫారం కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
దరఖాస్తుకు చివరి తేదీ
ఈ ఉద్యోగాలకు 2025 నవంబర్ 30 వ తారీకు వరకు ఈమెయిల్ దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ
2025 డిసెంబర్ రెండవ తారీఖున ఇంటర్వ్యూ నిర్వహిస్తారు

