రైల్వేలో కొలువుల జాతర: 10th అర్హతతో 32,438 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల || RRC Group D Notification 2025 details in telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Group-D: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి లెవెల్-1 గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాషలోనూ పరీక్ష ఉంటుంది. సికింద్రాబాద్ జోన్ లో ఉన్న 1,642 ఖాళీ పోస్టులకు ఏపీ, తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 2025 జనవరి 23వ తారీకు నుంచి 2025 ఫిబ్రవరి 22 తారీకు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉సిలబస్: 

పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. తప్పు సమాధానానికి 1/3వ వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్షకు 90 నిమిషాలు సమయం ఉంటుంది. జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథ మెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి.

RRB Group D
RRB Group D Notification 2026: రైల్వేలో 10th అర్హతతో 22,195 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

👉 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్:

  • పురుష అభ్యర్థులు: పురుషులు 2 నిమిషాల్లో 35 కిలోల బరువు ఉన్న ఇసుక బస్తాను దించకుండా 100 మీటర్ల దూరానికి మోసుకెళ్లాలి. ఇందులో విజయవంతమైనవారు కిలో మీటర్ దూరాన్ని 4 నిమిషాల 15 సెకన్లలో పరిగెత్తాలి. 
  • మహిళా అభ్యర్థులు: మహిళలైతే 20 కిలోల బరువు ఉన్న ఇసుక బస్తాను దించకుండా 2 నిమిషాల్లో 100 మీటర్ల దూరానికి మోసుకెళ్లాలి. దీన్ని అధిగమించినవారు కిలో మీటర్ దూరాన్ని 5 నిమిషాల 40 సెకన్లలో పరిగెత్తాలి.

👉 క్రింది లింక్ పై క్లిక్ చేసి తెలుగు భాషలో ఉన్న నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకుని.. పూర్తి వివరాలు చదివి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

RRB Group-D Details in Telugu

Official Website

AP SSC Exams Schedule 2026: ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

✅నిరుద్యోగుల కోసం: RRB Group-D “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NIT Warangal Recruitment 2026

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!