TS Government Jobs: తెలంగాణలో 1,931 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Government Jobs: తెలంగాణ రాష్ట్రంలో 1,931 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 25వ తారీకు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల 1,520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మరో 146 పోస్టులను నోటిఫై చేసినట్టు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కొత్త ఉద్యోగాలతో కలిపి భర్తీ చేసే మొత్తం పోస్టుల సంఖ్య 1,666 కి పెరిగాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 265 పోస్టులను తాజా నోటిఫికేషన్ లో జత చేశారు. వీటిని కూడా కలుపుకుంటే మొత్తం 1,931 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే అభ్యర్థుల వయోపరిమితిని 44 నుంచి 49కి పెంచారు. ఈ పోస్టులకు ఆగస్టు 25వ తారీకు నుంచి సెప్టెంబర్ 19వ తారీకు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమెల్) పోస్టులు.
మొత్తం ఖాళీలు: 1,931.

విద్యార్హతలు:

అభ్యర్థులు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (Female) ట్రైనింగ్ కోర్సు పూర్తి చేయాలి. (లేదా) ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉత్తీర్ణత. మిడ్వైఫరీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవాలి.

వయోపరిమితి:

2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 49 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

ఎంపిక విధానం:

రాతపరీక్ష, పని అనుభవం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎంపిక మొత్తం 100 మార్కులకు ఉంటుంది. రాతపరీక్ష ద్వారా 80 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థుల గత పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మరో 20 శాతం వెయిటేజీ కేటాయిస్తారు.

పరీక్ష కేంద్రాలు:

హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.

అప్లికేషన్ ఫీజు:

రూ.500/- ఫీజు చెల్లించాలి

దరఖాస్తు విధానం:

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

2023 ఆగస్టు 25వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తు చివరి తేది:

2023 సెప్టెంబర్ 19వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Vacancy Details

Full Notification

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!