APPSC | రవాణా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీపీఎస్సీ మరొక అవకాశం కల్పించింది.

APPSC Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ కు అనుబంధ నోటిఫికేషన్ ను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఇందులో పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పరీక్షా ప్రశ్నపత్రాన్ని ద్విభాషా (తెలుగు, ఇంగ్లిష్) రూపంలో ఇవ్వనున్నట్లు తెలిపింది. సబ్జెక్ట్ ప్రశ్నపత్రం మాత్రం ఆంగ్లంలోనే ఉంటుందని పేర్కొంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీపీఎస్సీ మరొక అవకాశం కల్పించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 21 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్: 17 పోస్టులు

విద్యార్హతలు:

బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్/ఆటోమొబైల్ ఇంజినీరింగ్) లేదా డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజినీరింగ్).

మోటారు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

01.07.2022 నాటికి 21 నుంచి 36 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం:

రాత పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-1, పేపర్-2), మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

పరీక్ష విధానం:

మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 150 మార్కులు, పేపర్-2 సంబంధిత సబ్జెక్టు నుంచి 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు.

దరఖాస్తు ఫీజు/ పరీక్ష ఫీజు:

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది.

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

జీత భత్యాలు:

నెలకు రూ.31,460/- నుంచి రూ.84,970/- వరకు

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

2023 ఆగస్టు 21వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరి తేది:

2023 ఆగస్టు 31వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష నిర్వహణ తేదీ:

2023 అక్టోబర్ 6వ తారీఖున నిర్వహిస్తారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Supplemental Notification

Full Notification

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!