TSPSC Group-1: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు.. హాల్ టికెట్లు ఎప్పుడంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి హైకోర్టు నిర్ణయంతో తెరపడింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 11 న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా హాల్ టికెట్లు జారీ చేయనుంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనుంది. 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ గతేడాది ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేశారు.

ఇటీవల కొందరు అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. దీంతో పరీక్ష యథావిధిగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

TS High Court Recruitment: తెలంగాణ హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!