7,500 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరొక మంచి శుభవార్త చెప్పింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) ఎగ్జామినేషన్ 2023 సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 7,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. టైర్-1, టైర్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, ఫిజికల్ టెస్ట్/ స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

పోస్టుల వివరాలు:

మొత్తం పోస్టులు: 7,500
పలు ప్రభుత్వ విభాగాల్లో భర్తీ చేయనున్న గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల వివరాలు: CBI సబ్ ఇన్స్పెక్టర్, NIA సబ్ ఇన్స్పెక్టర్, CBN ఇన్స్పెక్టర్ & సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, ఇన్స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్), ఇన్స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్), ఇన్స్పెక్టర్ (ఎగ్జామినర్), అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ పోస్ట్స్, ఇన్స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్/ సర్టింగ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్… తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

వయోపరిమితి:

సికింద్రాబాద్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీ – RRB ALP Notification 2026 | 11,127 Vacancies

2023 ఆగస్టు 1వ తారీఖు నాటికి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

నెలకు రూ.25,500/- నుంచి రూ.1,51,100/- వరకు

దరఖాస్తు ఫీజు/ పరీక్ష ఫీజు:

రూ.100/- ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం:

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

టైర్-1, టైర్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, పోస్టులను అనుసరించి ఇన్స్పెక్టర్ & సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
టైర్-1 పరీక్షను జూలై నెలలో నిర్వహిస్తారు.

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.

తెలంగాణ అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 ఏప్రిల్ 3వ తారీకు నుంచి 2023 మే 3వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

Notification Link

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!