AP Police Jobs: కానిస్టేబుల్ పరీక్షలో 8 మార్కులపై.. హైకోర్టు కీలక ఆదేశాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్షలో 8 ప్రశ్నలకు సరైన జవాబులను నిర్ణయించలేదని, ఈ వ్యవహారాన్ని నిపుణుల కమిటీకి నివేదించేలా ఆదే శాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం పై హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తీ వివరాలను తమ ముందుంచాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… ప్రిలిమినరీ పరీక్షలో 8 ప్రశ్నలకు సరైన జవాబులను ఇవ్వనందున దీనిని నిపుణుల కమిటీకి పంపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయని, వాటికి పిటిషనర్లను అనుమతించేలా అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలను తమ ముందుంచాలని రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేశారు.

AP High Court Hall Tickets 2026 Released – Download Admit Card for Various Posts

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!