TSPSC Group-4: గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. వాస్తవానికి దరఖాస్తు గడువు ఈరోజుతో ముగియనుండగా, ఫిబ్రవరి 3 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు 8,47,277 దరఖాస్తులు చేసుకున్నారని, ఇవాళ ఒక్క రోజే 34,247 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2022 డిసెంబర్ 30 నుంచి 2023 జనవరి 30 వ తేదీ వరకు దరఖాస్తులకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. అయితే, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువు పెంచింది. అంతేకాకుండా గ్రూప్-4 పోస్టుల సంఖ్యను పెంచుతూ వెబ్సైట్లో వెబ్ నోట్ విడుదల చేసింది. ప్రస్తుతం మొత్తం 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

గ్రూప్-4: 8,180 పోస్టులు

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2022 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 3వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Telangana TET Results 2026
Telangana TET Results 2026 – తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

2022 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC, SC, ST & EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు /పరీక్ష ఫీజు:

TS Anganwadi Recruitment 2026
TS Anganwadi Recruitment 2026 – తెలంగాణలో 15,274 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | 10th, ఇంటర్ అర్హతతో భారీ నోటిఫికేషన్

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు:200
పరీక్ష ఫీజు: 80

జీతభత్యాలు:

రూ.24,280/- నుంచి 72,850/- వరకు

ఎంపిక విధానం:

రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు చొప్పున 300 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

Khammam Job Mela 2026
Khammam Job Mela 2026 – ఏదైనా డిగ్రీ అర్హతతో ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ ఉద్యోగాలు భర్తీ

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Apply Online

Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!