TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 275 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, అగ్నిమాపక శాఖ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 19వ తారీఖు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

TSLPRB SI Notification 2026 details

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా 275 సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, అగ్నిమాపక శాఖ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

విద్యార్హతలు

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు మాత్రం డిగ్రీ అర్హతతో పాటు LMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

Age limit

01-07-2026 తేదీ నాటికి 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ఫైనల్ రాత పరీక్ష, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

తెలంగాణలో 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు ఆగస్టు 19వ తారీకు నుంచి సెప్టెంబర్ 9వ తారీకు వరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు

OC, BC, EWS అభ్యర్థులు రూ.1500 ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Telangana Police Constable Notification 2026
Telangana Police Constable Notification 2026: తెలంగాణలో 7,112 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!