Suryapet District Anganwadi Notification 2026: తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 131 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సూర్యాపేట జిల్లాలోని ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 24 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సూర్యపేట జిల్లా నుంచి అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 131 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సూర్యాపేట జిల్లాలోని మొత్తం ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి.
- అంగన్వాడి టీచర్ 67 పోస్టులు
- అంగన్వాడి హెల్పర్: 64 పోస్టులు
ఖాళీలు గల ప్రాజెక్టుల వివరాలు
సూర్యాపేట అర్బన్, చివ్వెంల, హుజూర్ నగర్, తుంగతుర్తి, కోదాడ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. (గ్రామాల వారీగా/ వార్డుల వారీగా ఖాళీల వివరాల కొరకు క్రింద ఇవ్వబడిన Vacancy Details PDF డౌన్లోడ్ చేయండి)
- చివ్వెంల: 15 టీచర్, 20 హెల్పర్ పోస్టులు
- తుంగతుర్తి 8 టీచర్ 19 హెల్పర్ పోస్టులు
- హుజూర్ నగర్: 17 టీచర్, 14 హెల్పర్ పోస్టులు
- సూర్యాపేట అర్బన్: 8 టీచర్, 9 హెల్పర్ పోస్టులు
- కోదాడ: 19 టీచర్, 2 హెల్పర్ పోస్టులు
విద్యార్హతలు
అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అంగన్వాడి హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హతతో పాటు పదవ తరగతి విద్యార్థులు కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోనట్లయితే పదవ తరగతి అర్హత కలిగిన వారికి అవకాశం కల్పిస్తారు
వయోపరిమితి
01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఇంటర్వ్యూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం
నీ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 13-07-2026 తేదీ నుంచి 24-07-2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. (క్రింద ఇవ్వబడిన Online Application form లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు)

