Telangana RTC Jobs: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 198 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని, మెకానికల్ సూపర్వైజర్ ట్రైని పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ, డిప్లొమా విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జనవరి 20వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఆర్టీసీలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని 84 పోస్టులు, మెకానికల్ సూపర్వైజర్ ట్రైని 114 పోస్టులను భర్తీ చేస్తున్నారు మొత్తం 198 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
వయోపరిమితి
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని పోస్టులకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానికల్ సూపర్వైజర్ ట్రైన్ పోస్టులకు డిప్లొమా లేదా బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
జీతభత్యాలు
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం
రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సిలబస్ వివరాలు

దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి రేపే ఆఖరు. అర్హత కలిగిన అభ్యర్థులు 20-01-2026 తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
