AP District Court DEO Notification 2026 details
AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. విశాఖపట్నం జిల్లా.. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, విశాఖపట్నం జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. ఓసి అభ్యర్థులకు కేటాయించారు. కాబట్టి ఓసి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ పరిజ్ఞానం కలిగి, మూడు సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి
01-01-2026 తేదీ నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 50 మార్కులకు, స్కిల్ టెస్ట్ 30 మార్కులకు, ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది. మొత్తం నూరు మార్కులకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
జీతభత్యాలు
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు రూ.28,280/- నుంచి రూ.89,720/- వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు
- OC, BC అభ్యర్థులు: రూ.1000/-
- SC, ST అభ్యర్థులు: రూ.500/- ఫీజు చెల్లించాలి
దరఖాస్తుకు చివరి తేదీ
27-01-2026 తేదీ లోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
