తెలంగాణ ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ | TSRTC Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSRTC Recruitment 2024: తెలంగాణ రాష్ట్రంలో TSRTCలో త్వరలో 3 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.

Whatsapp Group Link

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

Telegram Group Link

తెలంగాణ రాష్ట్రంలో TSRTCలో త్వరలో 3 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలు.. ప్రభుత్వం తుది దశలో ఉంది. వీటిలో అత్యధికంగా 2,000 డ్రైవర్ పోస్టులు ఉన్నట్టు ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్టీసీలో ఇక విడిగా డ్రైవర్, విడిగా కండక్టర్ పోస్టుల భర్తీ పద్ధతి ఉండదు. ఆ ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తి అవసరమైతే డ్రైవర్ గా, అవసరాన్ని బట్టి కండక్టర్ గా రెండు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం డ్రైవర్ కం కండక్టర్ పేరుతో ఉమ్మడిగా ఆ రెండు పోస్టులు భర్తీ చేసే యోచనలో ఆర్టీసీ ఉంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

టీఎస్ఆర్టీసీ త్వరలో చేపట్టనున్న ఖాళీ పోస్టులలో డ్రైవర్ 2000 పోస్టులు, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) 114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 23, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11, ఎకౌంట్స్ ఆఫీసర్ 6 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాటు ఆక్యుపెన్సీ రేషియో సైతం 100 శాతానికి చేరుకుంది. దీంతో సిబ్బంది అదనంగా మరికొన్ని గంటలు పని చేయాల్సి వస్తోంది. దీంతో ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Download Our App

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!