April 16, 2025
All India Govt Jobs

రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RRB ALP Recruitment 2025

RRB ALP Notification 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో మొత్తం 9,970 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 1500 ఖాళీలు ఉన్నాయి. పదవ తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటిఐ/డిప్లొమా/ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

▶️ Organization Details:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

▶️ Vacancies Details:

ఈ నోటిఫికేషన్ ద్వారా 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్లో 1,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

▶️ Education Qualifications:

10వ తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటిఐ/డిప్లొమా/ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

▶️ Age limit:

01-07-2025 తారీకు నాటిక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

▶️ Salary:

నెలకు రూ.19,900 జీతంతో పాటు రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం అలవెన్సులు ఉంటాయి.

▶️ Selection Process:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

▶️ How to Apply:

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

▶️ Application Fee: 

ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలు, ఈబీసీ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి.

▶️ Apply Dates:

12-04-2025 తేదీ నుంచి 11-05-2025 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

▶️ Note: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Apply Online

Official Website

✅AP, తెలంగాణ నిరుద్యోగుల కోసం: Forest Beat Officer, SI/Constable, RRB Group-D, RRB ALP ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!