TTD Recruitment 2023: టీటీడీ విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీ.. ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్
టీటీడీ విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అనుమతులు జారీ చేసినట్లు టీటీడీ ధర్మకర్తల మండల చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏప్రిల్ 15న టిటిడి బోర్డు చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయాలను ఈవో ధర్మారెడ్డి తో కలిసి ఆయన మీడియాకు వివరించారు.
టీటీడీ విద్యాసంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు బ్రోదనా సిబ్బందిని కొనసాగిస్తూనే రెగ్యులర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించామన్నారు. ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.