TSPSC Group-4 Hall Tickets 2023: గ్రూప్-4 హాల్ టిక్కెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?
TSPSC Group-4 Hall Tickets 2023: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇటీవల కొన్ని పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రూప్-4 పరీక్షలను మాత్రం యథావిధంగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్షల యొక్క హాల్ టికెట్లను వారం రోజులు ముందుగా విడుదల చేయనున్నారు. అంటే జూన్ 24వ తేదీన హాల్ టికెట్లు విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.
గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 జూలై 1న టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. అలాగే గ్రూప్-4 ఉద్యోగాలకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 116 మంది పోటీ పడుతున్నారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి