November 13, 2024
TS Govt Jobs

TSPSC Group-2: గ్రూప్-2 పరీక్ష వాయిదా!.. నవంబర్ నెలలో నిర్వహణ

TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం ఆదేశాలతో ఈనెల 29, 30న జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను నవంబర్ కు వాయిదా వేసింది.

TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 29, 30న జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను నవంబర్ కు వాయిదా వేసింది. గ్రూప్-2 పరీక్షల రీ షెడ్యూల్ గురించి సీఎస్ శాంతకుమారి గారితో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్చించారు. టీఎస్పీఎస్సీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ కు సూచించారు. లక్షలాది మంది విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో విడుదల చేసే నోటిఫికేషన్ల విషయంలోనూ అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎస్ శాంతకుమారి గారికి సూచించారు. అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాలమేరకు సీఎస్ శాంతికుమారి టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శితో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్-2 పరీక్షలను మూడు నెలలపాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ నెలలో పరీక్షలను నిర్వహించనున్నారు. త్వరలోనే టీఎస్పీఎస్సీ కొత్త తేదీలను ప్రకటించనుంది.

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!